Telangana Land Records with Survey Numbers

0

Telangana Land Records with Survey Numbers – Dharani Portal ద్వారా ఎలా తెలుసుకోవాలి

 Telangana Land Records Search తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు కాని భూయజమానులు కాని తమకు సంబంధించిన భూమి వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడానికి వీలుగా ఒక మాడ్యూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాడ్యూల్ ద్వారా మనము ధరణి పోర్టల్ లో మన సర్వే నంబర్ ద్వారా మన భూమి యొక్క విస్తీర్ణం మరియు ఖాతా నంబరు భూమికి సంబంధించిన తదితర వివరాలు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది.

🌐 వెబ్‌సైట్: https://dharani.telangana.gov.in

ఈ వ్యాసంలో మీరు నేర్చుకోబోయే విషయాలు:

  • ధరణి పోర్టల్ అంటే ఏమిటి?

  • సర్వే నంబర్ ద్వారా భూమి వివరాలు ఎలా చూడాలి?

  • ల్యాండ్ సెర్చ్ పేజ్‌లో కనిపించే ముఖ్యమైన డేటా

  • ముఖ్యమైన సూచనలు & జాగ్రత్తలు


Telangana Land Records with Survey Numbers

Land Record Search :భూమి వివరాలు తెలుసుకోవడానికి కావలసినవి:

  • భూమి ఉన్న జిల్లా పేరు 
  • భూమి ఉన్న మండలం పేరు 
  • భూమి గ్రామం పేరు (శివారు, ఈలక )
  • సర్వే నంబరు 

ఈ మాడ్యూల్ ద్వారా భూయజమానులకు కానీ రైతులు కానీ తమ యొక్క భూమి వివరాలు చూసుకోవడానికి తమ దగ్గర ఉన్న పాస్ బుక్ లోని సర్వే నంబర్ ద్వారా చూసుకోవచ్చు. ఇందు కొరకు రైతులు కానీ భూ యజమానులు గానీ ధరణి పోర్టల్లోకి వెళ్లి ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత భూమియొక్క వివరాలు నమోదు చేసి భూమికి సంబందించిన విషయాలు చూడవచ్చు.


Telangana Land Records with Survey Numbers
ధరణి పోర్టల్ ల్లో  ప్రొహిబిటెడ్  లిస్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా?

Survey Number ద్వారా Telangana Land Records చూడాలంటే?

పదే పదే వాడే స్టెప్స్:

  1. Dharani Portal ను ఓపెన్ చేయండి:
    👉 https://dharani.telangana.gov.in

  2. "LAND DETAILS SEARCH" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి (పేజీలో కనిపించే మెనూ ల్లో)

  3. మీ జిల్లా, మండలం, గ్రామం, మరియు సర్వే నంబర్ ఎంపిక చేయండి

  4. కెప్చా ఎంటర్ చేసి “FETCH” పై క్లిక్ చేయండి

  5. మీ భూమికి సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

Land Record Search ద్వారా ఎలాంటి వివరాలు తెలుస్తాయి.



Land Record Search ద్వారా భూమి యొక్క యజమాని పేరు, భూమి విస్తీర్ణం, యజమాని యొక కాస్ట్, డిజిటల్ సిగ్నచర్ స్థితి, భూమి పై ప్రస్తుతం జరిగే లావాదేవీల వివరాలు, భూయొక్క సహజ స్థితి మొదలగునవి తెలుసుకోవచ్చు.


Land Details Search Page లో కనిపించే ముఖ్య సమాచారం.

ఈ పేజీలో మీకు కనిపించే వివరాలు ఇవే 👇
  • Owner Name (భూమి యజమాని పేరు)

  • Survey Number / Sub-division Number

  • Extent (గజాలు/ఎకరాలు) – భూమి యొక్క పరిమాణం

  • Land Type – పొలం భూమి (Wet / Dry), నాన్-అగ్రికల్చరల్

  • Khata Number (Pattadar Passbook Number)

  • Nature of Title – స్వంత భూమా? లీజ్ లోనా?

  • Encumbrance Details – భూమిపై రుణాలు లేదా బాకీలు ఉన్నాయా?

ఈ సమాచారం ఆధారంగా భూమి ఖచ్చితంగా ఎవరి పేరిట ఉందో, తదితర హక్కుల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవన్నీ ఎందుకు ముఖ్యం? 

భూమి కొనుగోలు, అమ్మకం, లీజింగ్, లేదా బ్యాంక్ లోన్ కోసం మీరు ఎప్పుడైనా భూమి వివరాలు పరిశీలించాల్సి వస్తుంది. Survey Number ద్వారా మీరు:

  • భూమి చరిత్రను తెలుసుకోవచ్చు

  • ఎవరి పేరు మీద ఉందో నిర్ధారించవచ్చు

  • ఏమైనా వివాదాలున్నాయా అన్నది చెక్ చేయవచ్చు

  • భూమి ఖాళీగా ఉందా లేక అప్పులో ఉందా అన్నది తెలుసుకోవచ్చు

గమనికలు & సూచనలు 

  • మీరు చూసే వివరాలు ఖచ్చితమైనవే అయినా, మౌలిక సర్టిఫికేట్‌లు (EC, Pahani, Title Deed) కూడా పరిశీలించండి.

  • హద్దులు, మార్పులు ఉంటే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించండి.

  • భూమిపై ఎవరికైనా హక్కులు లేదా కేసులు ఉన్నాయా అన్నది చూడండి.

సమాప్తి 

తెలంగాణలో భూమి వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు కేవలం కొన్ని క్లిక్‌ల వ్యవహారమే. Dharani Portal ద్వారా Survey Number ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవడం వల్ల మీరు చట్టబద్ధంగా, భద్రతగా కొనుగోలు లేదా అమ్మకం చేసే అవకాశం ఉంటుంది.

👉 మీ భూమిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలంటే, నేటికే ధరణి పోర్టల్‌ను సందర్శించండి మరియు వివరాలు తనిఖీ చేయండి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)